Sep 4, 2024

16 - మనం విశ్వాన్ని మనకి ఏం కావాలో ఎలా అడగాలి?

    #lawofattraction

 29aug24 - loa notes

 మనం విశ్వాన్ని మనకి ఏం కావాలో ఎలా అడగాలి?

 మనకి ఏమేం కావాలో మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకున్న కోరికలు ఏంటో అన్నిటినీ ఆలోచించి ఆలోచించినప్పుడు వందలు వేల కోరికలు మన కళ్ళ ఎదుట ఉంటాయి 

 ఒక్కసారి వాటన్నిటినీ ఒక మెనూ కార్డు లాగా ఊహించుకొని మీరు హోటల్ కి వెళ్ళినట్టు ఆ హోటల్లో మెనూ తిప్పుతున్నట్టు అందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇష్టమైన డిష్ ని మీరు ఆర్డర్ చేసినట్టుగా ఊహించుకోండి 

 అంటే మీకు ఉన్న కోరికలన్నిటిలిస్టులోకి మీకు బాగా ఇష్టమైనది బాగా కోరుకున్నది ఏదో మీరు ఒకటి ఎంచుకోండి 

 ఇప్పుడు మీరు ఎప్పుడైతే రెస్టారెంట్ కి వెళ్తారో మీరు సపోజ్ ఒక బిర్యానీ ఆర్డర్ చేశారు అనుకోండి ఆ బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత మీరు కబుర్లు మునిగిపోతారు లేదా ఫోన్ చూసుకుంటూ అందులో మునిగిపోతారు కానీ నేను ఆర్డర్ చేసిన బిర్యాని వస్తుందో రాదో వస్తుందో రాదో అని మాటిమాటికి చెక్ చేయటం మాటిమాటికి కిచెన్ దగ్గరికి వెళ్లి చూడటం లాంటివి చేయడు 

 ఎందుకంటే మీకు తెలుసు మీరు ఆర్డర్ చేశారని ఆర్డర్ తీసుకున్నారని అతను రాసుకున్నాడని కచ్చితంగా మీ ఆర్డర్ మీకు వచ్చి తీరుతుంది అని 

 ఎలాగైతే రెస్టారెంట్లో అంత ఖచ్చితంగా అంత విశ్వాసంతో ఉన్నారో ఈ విశ్వాన్ని కూడా అంతే విశ్వాసంతోటి మీరు ప్రార్థించి మీ కోరికను మీరు కోరుకోండి 

 మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టే మీరు ఒక కోరిక కోరుకున్న తర్వాత దాని గురించి మళ్లీ మళ్లీ మనం చేయడం మళ్ళీ మళ్ళీ ఆలోచించటం మళ్ళీ మళ్ళీ రాయటం చదవడం లాంటివి చేసినప్పుడు మీ మనసు దాని మీద దృష్టి పెడుతుంది.....మనకు తెలుసు మనం ఏది ఆలోచిస్తే అదే కచ్చితంగా జరుగుతుంది అని... 

ఆలోచిస్తే జరుగుతుంది ఆలోచించకపోతే ఆలోచించటం మరచిపోతే అది జరగదు ఎలాగైతే కరెంట్ బిల్లు కట్టడం మర్చిపోతాము అలాగే 

 మీకు ఎప్పుడైతే నేను కోరుకున్న కోరిక జరుగుతుందా జరగదా జరగకపోతే ఏం చేయాలి? ఇంత కష్టపడ్డాను నాకు కోరిక జరగకపోతే అప్పుడు నా టైమ్ ఎంత వేస్ట్ కదా ఇదేం చాలా సిల్లీగా ఆలోచిస్తున్నానా ఇలాంటి డౌట్స్ పెట్టుకోకుండా నేను ఇది కోరుకున్నాను కచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని మీరు అమితమైన విశ్వాసం తోటి మీరు ఎప్పుడైతే నమ్ముతారు మీరు కచ్చితంగా మీరు కోరుకున్నది పొందుతారు

===============

 విశ్వం మనకి ఏది అడిగినా అది ఇస్తుందా ఎలా ఇస్తుంది 

 మనం కోరిక కోరుకున్నప్పుడు యూనివర్సిటీలో విశ్వంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి?

 విశ్వం మనకి ఏది అడిగినా అది ఇస్తుంది ఎప్పుడైతే మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారో మీరు ఏది అడిగినా అది మీ వద్దకు చేరుతుంది కాకపోతే మీరు చేయవలసిందిగా మీకు ఏం కావాలో అది కోరుకోవడం ఈ విశ్వం తోటి మీరు అనుసంధానమై ఉండటం కనెక్ట్ అయి ఉండటం కమ్యూనికేట్ చేయటం 

 ఎలాగైతే మీరు మీ పక్క రూమ్లో ఉన్న వాళ్ళని పిలవటానికి వాళ్ల పేరు పెట్టి అరేయ్ రాముని వారి కృష్ణ అంటూ పక్క రూమ్ లో ఉన్న వారిని పిలుస్తారు వాళ్లు పలకకపోతే మళ్ళీ మళ్ళీ పిలవటం ఇంకా గట్టిగా పిలవటం లాంటివి చేస్తూ ఉంటారో కచ్చితంగా ఒకసారి కాకపోతే నాలుగో సార్ కి 10 సార్లకి వారు మీకు రెస్పాండ్ అవుతారు అనే నమ్మకం తోటి మీరు ఎలాగైతే పిలుస్తుంటారో అలాగే విశ్వానికి కూడా మీకు కావాల్సింది మీరు చెప్తున్నప్పుడు విశ్వం నుంచి మీకు జవాబు దొరుకుతుంది 

 మరి విశ్వం మీరు అడిగినప్పుడు ఎలా పనిచేస్తుంది మీరు ఒక కోరిక కోరుకున్నప్పుడు ఈ విశ్వంలో ఏం జరుగుతుంది 

 మీరు ఒక కోరిక కోరుకున్నప్పుడు లేదా సమస్యని పరిష్కరించమని కోరుకున్నప్పుడు విశ్వంలో పలు మార్పులు జరుగుతాయి ఎలాగైతే ఎండాకాలంలో సూర్యుడికి దగ్గరగా వెళ్ళటం వర్షాకాలంలో సూర్యుడికి దూరంగా వెళ్లడం జరుగుతుందో అలాగే మీరు ఒక కోరిక కోరుకున్నప్పుడు అనంత విశ్వంలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి

 నేను చింతచిన్నగా మాట్లాడితే అనంత విశ్వంలో ఎలా కొమ్మార్పీలు జరుగుతాయి అనే సందేహం మీకు రావచ్చు నేను ఒక ఉదాహరణ చెప్తాను 

 నేను ఒక బైక్ నడుపుతున్నాను ఆ బైక్ నడుపుతున్న నాకు ఇష్టం లేదు ఎందుకో నాకు నచ్చలేదు అలా కొన్ని రోజులు ఉపయోగించిన తర్వాత నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఇంకో స్పోర్ట్స్ బైక్ లాంటిది నచ్చింది అరేయ్ డిజైన్ బాగుంది ఈ బ్రాండ్ బాగుంది కలర్ బాగుంది లాంటి బాగుంది లాంటి మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే బాగుంది అంటున్నాను నా మనసు పాజిటివ్ వైబ్రేషన్ లో ఉంది పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉంది సో నేను అందించిన ఈ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ వరకు వెళ్లి ఆకర్షించింది అప్పుడు ఎలాంటి మార్పులు జరిగినాయో చూడండి 

 నేను బైక్ కావాలనుకున్నాను ఏ బైక్ కావాలో అర్థమైంది ఎలా ఉండాలో అర్థమైంది ఏ రంగు ఉండాలో అర్థమైంది. ఇప్పుడు నేను బాగుంది అంటుండగా ఒకరోజు జోరున వర్షం పడింది వర్షం లో నా బైక్ కింద పడింది కింద పడినప్పుడు నా బైక్ లో జరిగిన మార్పుల వల్ల నాకు బ్యాక్ పెయిన్ రావటం మొదలుపెట్టింది బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి నేను ఈ బైక్ అమ్మేద్దాం అనుకున్నాను అమ్మేసి వచ్చిన డబ్బులతోటి నా కాస్త డబ్బులు తగ్గినా కూడా ఆ వచ్చిన డబ్బులతోటి నేను కొత్త బైక్ కొందాం అనుకున్నాను కొత్త బైక్ ఎటు కొనాలి కాబట్టి ఇంతకుముందు నాకు నచ్చిన పైకే కొందాం అనుకున్నాను నచ్చిన బైకు ఇప్పుడు నేను వెతికి దాన్ని నేను కొనుక్కోవడం సొంతం చేసుకోవడం జరిగింది 

 మామూలుగా నాకు ఏ కోరిక ఉండకపోయుంటే నేను అదే బైక్ ని ఇంకా జాగ్రత్తగా నడిపి కింద పడేటట్టుగా పడకుండా నడిపి దాన్ని ఇప్పటికీ అదే బైక్ నేను వాడుతూ ఉండేవాడినేమో 

 ఇంకో ఉదాహరణలో నేను ఒక రకమైన ఒక కార్ని కొందాం అనుకుంటున్నాను కానీ నేను అనుకున్న బడ్జెట్ కి ఆ కార్ బడ్జెట్ కి చాలా ఎక్కువ సో నేను అనుకున్న బడ్జెట్లో ఒక మంచి ఇదే కారో ఒక బాగా మంచిగా ఉన్న కార్డు దొరికితే బాగుండు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రకృతిలో జరిగిన మార్పులు ఎలా ఉన్నాయి అంటే ఎక్కడో ఎవరో వేరే దేశం కి వీసా వచ్చినందువల్ల ఇమీడియట్ గా వాళ్ల కారు అమ్మేద్దాం అనుకున్నారు. ఆ నేను ఏ కార్ అయితే కొందాం అనుకున్నాను వాళ్ళు అదే కార్ అమ్ముదాం అనుకున్నారు వాళ్ళు 

 ఎవరో ఎక్కడో అమ్ముదాం అనుకున్నా కారు ఇన్ఫర్మేషన్ నా వరకు వచ్చింది అది మొబైల్ వరకు ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే నేనే వెళ్లి కార్ షోరూమ్ లోకి వెళ్ళినప్పుడు కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చి చేరింది ఇప్పుడు ఆ నేననుకున్నా ఆ కార్ నేను అనుకున్నా బడ్జెట్లో వచ్చింది వాళ్ళు చాలా తక్కువ రోజులు వాడారు కారు బాగుంది ఇమీడియట్గా నా బడ్జెట్ తో నేను కొనేశాను సో ఓ ఒకవేళ నేను కనుక నాకు ఇలాంటి కారు ఇలాంటి బడ్జెట్లో కావాలి అని గనక నేను డెసిషన్ తీసుకోకపోయిన నేను కోరుకోకపోయి ఉంటే ఇప్పటికీ నా బడ్జెట్ నా బడ్జెట్ అంటూ ఏ కారు ఏ కారు ఏ మోడల్ అనుకుంటూ అలా అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాణ్ణి నా బడ్జెట్లో కారు వస్తుందా ఈ కారు వస్తుందా? ఏ కారు కొనుక్కోవాలి తక్కువ నాన్న ఎక్కువ లో కొనాలా అనుకుంటూ అక్కడక్కడే అక్కడే ఉంటాం ఉంటాం మనం 

 అదే మనకి ఏం కావాలి ఎంత బడ్జెట్ ఎప్పటిలోగా కావాలి ఇలాంటివి ఫిక్స్ అయిపోయి డెసిషన్ డెసిషన్ అంటుంటారు కదా ఆర్ డెసిషన్ కనుక తీసుకోగలిగితే కచ్చితంగా యూనివర్స్ లో మార్పులు జరిగి ఈ ప్రకృతి మీరను ఏదైతే అనుకుంటున్నారో అది మీ చేతికి తెచ్చేస్తుంది 

 ఒకసారి ఇలాగే నేను ఈ ఒక జాబ్ సెర్చ్ లో ఉన్నాను అయితే ఈ జాబ్ ఎలాగైనా వదిలేయాలి ఇంకో కొత్త జాబ్లో ఇంత శాలరీ జాయిన్ అవ్వాలి ఇంత శాలరీ జాయిన్ అవ్వాలి అని ఎవరీ డే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో ఉన్నాను కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను కానీ అంత రిజల్ట్ ఏం బాగోలేదు నా మీద నాకు డౌట్ రాకుండా ఎవరీ డే నాకు ఉన్న నాలెడ్జ్ సరిపోతుంది నేను ఈ నాలెడ్జ్ తోటే జాబ్ కొట్టాలనుకుంటున్నానని పాజిటివ్ వైబ్రేషన్ తోటి నేనున్నాను ... ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా పనిచేసింది అంటే నాకు ఒక రోజు ఒక కాల్ వచ్చింది అందులో మీ ఫైనల్ రౌండ్ పూర్తయింది మీరు ఆఫీస్ కి వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోండి అని అసలు ఈ జాబ్ కి నేను ఎప్పుడో అప్లై చేశాను ఈ రౌండ్స్ అన్ని ఎప్పుడు అయిపోయినాయి అని ఇన్ఫర్మేషన్ కూడా నాకు గుర్తులేదు అలా మనం పాజిటివ్ అపర్మేషన్స్ విశ్వంలో పంపిస్తూ ఉంటే కచ్చితంగా మనమేం అనుకుంటున్నామో అవి జరిగి తీరుతాయి 

 యూనివర్స్ లో మార్పులు జరుగుతాయి అని చెప్పాను కాబట్టి మీరు కోరుకున్న ప్రతి కోరికకి ఎలా యూనివర్స స్పందిస్తుంది ఎలా విశ్వంలో మార్పులు చెందుతాయి ఇలాంటి ఆలోచనలు వదిలేసి కేవలం మీరు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ లో పాజిటివ్ ఫ్రీక్వెన్సీ లో ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి మిగిలిందంతా యూనివర్సి ఎలాగో చూసుకుంటుంది 

===========

 ప్రతి కోరిక నిన్ను ఒక పని చేయమంటుంది ఆ పని నేను మనం inspired action  (ఇన్స్పైర్ ఆక్షన్ )అంటాం 

 Inspired action చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా నేను ఇంత పెద్ద పని చేస్తున్నా అని ఇంత కష్టపడుతున్నా అని ఇంత కష్టపడితేనే ఇంత డబ్బు వస్తుందని అనిపించదు. వాళ్ళు కేవలం తమ పని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తున్నందుకు తమకు డబ్బులు ఇస్తుంటారు 

 ఉదాహరణకి నువ్వు పెద్ద లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే దాన్ని ఎంజాయ్మెంట్ చేస్తుంటావ్ కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నందుకు నీకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఇంకొకళ్ళు ఒక బ్యాక్ పట్టుకొని రోడ్డు మీదకెళ్ళి గట్టిగా రోడ్డు మీద నుంచి బాల్ ని గ్రౌండ్ లో నుంచి రోడ్ మీదకి కొడితే దానికి డబ్బులు ఇవ్వరు ఏ పని ఎవరు ఎక్కడ చేయాలో అక్కడ చేస్తే దానికి డబ్బులు ఇస్తారు 

 నువ్వు ఎంజాయ్ చేసే ఆ డాన్స్ వెళ్లి మైకేల్ జాక్సన్ డాన్స్ చేసిన అదే పోడియం మీద చేయగలిగితే దానికి నీకు ప్రపంచం మొత్తం మొగుడు అయి డబ్బులు ఇవ్వచ్చు.... అలాగే నువ్వు ఒక గ్రౌండ్ లో నుంచి బాల్ ని రోడ్డుపై కొట్టే కంటే ఒక స్టేడియం లో కొడితే ఆ స్టేడియంలో వేల మంది నుంచున్నప్పుడు అప్పుడు కొడితే నీకు డబ్బులు ఇస్తారు 

 ఒక సచిన్ టెండుల్కర్ చిన్నప్పుడే తనకి ఏమి ఇష్టమో ఆ ఇష్టమైన పని ఇంకా బాగా గట్టిగా నేర్చుకొని ఇంకా చెప్పాలంటే ఇష్టమైన పని అలా ఆనందం కోసం చేస్తూ చేస్తూ ఇప్పటికీ అదే ఆనందం పొందుతూ దాంట్లో కోట్ల కోట్ల రూపాయలు సంపాదించాడు మరి ఇన్ని కోట్లు సంపాదించినందుకు సచిన్ 24 గంటలు కష్టపడతాడు అని ఎవరైనా అంటే అది కరెక్ట్ కాదు... ఒక ప్రాక్టీస్ కి వెళ్ళినా.. ఇంకో దేశం తమ ఫ్యామిలీని వదిలేసి ఒక టూర్ కి రెండు మూడు నెలలు ఒక ఎడాది పాటు వెళ్లిన అక్కడ ఆ టూర్లో అతను ఒక ఐదు రోజులు మ్యాచ్ ఆపకుండా బ్యాటింగ్ చేసిన ఈ మొత్తం లో ఎక్కడా కూడా అతను కష్టపడడు కేవలం తనకి నచ్చిన పని చేస్తూ ఉంటాడు...

 ఒక సింగర్ 24 గంటలు వెళ్లి పాటలు పాడిన లేకపోతే

 ఒక  ఆర్టిస్టు తనపై తన ఊహించుకున్న చిత్రాన్ని ఒక కాన్వాస్ పైన గీసి ధనకు నచ్చిన రంగులు దానిమీద వేసి ఒక ఆనందం పొందుతాడు ఒక అనుభూతి పొందుతాడు అతను అనుభూతి పొందటమే కాక ఆ పెయింటింగ్ పక్కన పెడితే దానికి లక్షలు కోట్లు ఇచ్చి వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇలా ఎవరైతే తనకి నచ్చిన విషయాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారో అలాంటి పనికి లక్షలు కోట్లు డబ్బులు ఇవ్వడానికి ప్రపంచం రెడీగా ఉంటుంది ఇదే కాదు 

 ఇంతే కాదు ఆ రిలయన్స్ అంబానీ ఎవరైతే ఉంటారో 24 గంటలు బిజినెస్ చేయటంలో ఒక ఆనందాన్ని పొందుతాడు అదే బిజినెస్ ని నేను చేద్దామని ప్రయత్నిస్తే నేను దాన్ని అంత బాగా ఆస్వాదించలేకపోవచ్చు

 ఎవరికి ఏది ఇష్టమో అది వాళ్ళ మనసే వాళ్లకు చెప్తుంది... ఆ చెప్పిన విషయాన్ని గ్రహించి దాని వైపు అడుగులు వేస్తూ వెళ్తే నీవు కావాలనుకున్న ఆ డబ్బు నువ్వు కావాలనుకున్న జీవితం తప్పకుండా నీ సొంతమవుతుంది...

 ఒక శివమణి డ్రమ్స్ కొడుతున్నాడు అన్న ఒకడు ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అన్న ఒక రాజమౌళి ఒక పెద్ద సినిమా స్టోరీ తీసుకొని దాన్ని ఊహించి దానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అతనికి ఎంత ఎండలో నుంచున్నా సరే ఎంత అర్ధరాత్రి అయినా సరే అందులో ఒక ఆనందపు అనుభూతి పొందుతాడు ఆ అనుభూతి కోసమే అతను పని చేస్తాడు అంత అనుభూతి ఇస్తాడు కాబట్టే చూసే వాళ్లకు కూడా అంతే అద్భుతమైన ఆనందం కలిగేలా చేస్తాడు..

 ప్రాసెస్ లో అతనికి కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది.... అంతేకానీ తనకు కావలసినంత డబ్బు కావాలి అని చెప్పి అతను ఏమీ తీయడు..

 ఈ ఆనందపు అనుభూతి కోసం చేసే పన్నే మనం ఇన్స్పైర్ యాక్షన్ అంటాము...ఆ ఇన్స్పైర్ యాక్షన్ లో ఎవరైతే అనుభూతి పొందుతారో ఆనందపనుభూతి పొందుతారో వారికి డబ్బు వెతుక్కుంటూ సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది 

 అంతేగాని ఏం చదువులు రా బాబు ఏం జాబ్ రా బాబు అనుకుంటూ చేసే పని ఎప్పటికీ నీకు ఆనందాన్నివ్వదు. నువ్వు ఎవరికి పని చేస్తున్నావు వాళ్ళకి అనుభూతిని ఇవ్వదు ఒక టీ పెట్టేవాడు ఎంత ఇంత రోడ్డు మీద నుంచి ఉన్న ఎంతటి ఈగలు వాలుతున్న ఎంత వర్షం పడుతున్న కూడా ఆ టీ చేసే ప్రాసెస్ ని అతను ఒక అనుభవం ఆనందపు అనుభూతితో చేస్తే ఆ టీ తాగిన వాళ్లకు కూడా అంతే ఆనందం కలుగుతుంది...

 అలాకాకుండా ఏం పని రా బాబు ఇది ఇంత ఎండలో నేను ఉంచొని పెట్టాలా ఇంత వర్షంలో నుంచి పెట్టాలా అని ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేస్తావో దాంట్లో ఎలాంటి అనుభూతి నీకు ఉండదు దాన్ని అనుభవించే వాళ్ళకి ఉండదు 

================

 Weight loss / perfect body

 చాలామంది తమ లావుగా ఉన్నామని తమ సేఫ్ బాడీ షేప్ బాగోలేదని వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తుంటారు కానీ ఎన్ని రోజులు వెయిట్ లాస్ అవుతాము అని ట్రై చేసిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వవుగా ఇంకా పెరుగుతూ ఉంటారు 

 దీనికి ఒక కారణం ఏంటంటే వాళ్లు మాట్లాడే మాటలే 

 నేను వెయిట్ లాస్ అవ్వాలి నేను ఓవర్ వెయిట్ గా ఉన్నాను 

ఈ ఓవర్ వెయిట్ తగ్గించాలి 

నాకు థైరాయిడ్

 మా ఇంట్లో వంశపారంపరంగా అందరం లావుగా ఉంటాము 

 మీరు ఎప్పుడైతే లావుగా లావుగా లావుగా బరువుగా బరువుగా అనే వర్డ్స్ రిపీట్ చేస్తూ ఉంటారు అన్నిసార్లు మీరు లావుగా ఉన్నారు అనే పిక్చర్ మీ మైండ్ లోకి వస్తూ ఉంటుంది మీరు ఎంత ఎక్కువసార్లు మీ సన్నగా ఉండే పిక్చర్ మ్యాచింగ్ చేసుకోగలుగుతారు అంత త్వరగా మీరు సన్నబడతారు 

 లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు ఏం మాట మాట్లాడతారు ఆ మాటకు తగ్గట్టుగానే మీకు లైఫ్ లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి 

 కాబట్టి మాట మార్చుకోగలిగితే మీ లైఫ్ మారుతుంది

 మొదట, మీరు ఎంత బరువు ఉంచి ఎంత బరువుకు రావాలో ఒకసారి కచ్చితంగా అనుకోండి , మిమ్మల్ని మీరు సన్నగా ఊహించుకోండి సన్నగా ఉన్నట్టుగా మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు బరువు ఓవర్ వెయిట్ లావు లాంటి పదాలు వాడటం మానేయండి 

 తరువాత మీరు పర్ఫెక్ట్ వెయిట్ నేను పర్ఫెక్ట్ వెయిట్ పర్ఫెక్ట్ బాడీ పర్ఫెక్ట్ షేపులో ఉన్నాను అనే ఇన్ఫర్మేషన్ ని ప్రతిరోజు మీరు నిద్రలేచిన లేవంగానే ఇంకా మీకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఉచ్చరణ చేస్తూ ఉండండి 

 ఇన్స్పైర్ యాక్షన్ మీరు సన్నబడాలి అనుకున్నప్పుడు మీ మనసు మీకు ఏదో ఒక ఇన్స్పైర్ ఆక్షన్ చెప్తుంది అంటే ఈ పని చెయ్యి నీ ఒక పని చెయ్యి చెప్పవా అన్నం బదులు చపాతీ తిను పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళు లేదా జిమ్ లో రన్నింగ్ చెయ్యి అలాంటి ఏదో ఒకటి మీకు చెయ్యదగ్గ పనే ఏదో ఒకటి మీ మనసు నుంచి ఒక సందేశం వస్తుంది ఆ సందేశాన్ని మీరు ఫాలో అవ్వండి 

 నెంబర్ 3 మీరు ఎప్పుడూ కూడా మీ బాడీని ఇష్టపడండి ప్రేమించండి

 ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని మీకున్న ఆకృతిని మీరు ఇష్టపడరు చిరాకు పడతారు దాన్ని ద్వేషిస్తారు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదేంటంటే మీరు ఏం మాట మాట్లాడతారో ఎలా ఫీలవుతారు మీకు ఇంకా అది పెరిగి పెద్దది అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న బాడీ షేప్ వస్తుంది నీ బాడీ చాలా బాగుంది మీరు ఏం తిన్నా అరిగిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండండి

 మెయిన్ థింగ్ మీ శరీరాన్ని గురించి మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంచుకోండి 

 ఈ ఫాలో అయితే కచ్చితంగా మీరు అనుకున్న టైం కి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆ పర్ఫెక్ట్ బాడీని పొందగలుగుతారు 


No comments:

Post a Comment

3jun 2025 d vitamin